Politics24th Sep 11:56 AMSunil Byrisetty1 min read
జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృతస్ధాయి సమావేశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్ధాయి సమావేశం ఆ పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన జరగనుంది. వరుసగా అసెంబ్లీ సమావేశాలకు జగన్ పార్టీ గైర్హాజరవుతున్న నేపథ్యంలో అనర్హత వేటుపై అధికార కూట
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్ధాయి సమావేశం ఆ పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన జరగనుంది. వరుసగా అసెంబ్లీ సమావేశాలకు జగన్ పార్టీ గైర్హాజరవుతున్న నేపథ్యంలో అనర్హత వేటుపై అధికార కూటమి యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మళ్ళీ జనంలోకి వెళ్ళే ఆలోచనలో వైయస్ జగన్ ఉన్నట్లు సమాచారం. పార్టీ ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అనర్హత వేసేలోగా రాజీనామా చేసి జనంలోకి వెళ్తే ఉభయ తారకంగా ఉంటుందని.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే అవకాశం ఉంటుందని యోచన చేస్తున్నారు. ఈ రోజు జరిగే కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.