Politics29th Jul 03:33 PMSunil Byrisetty1 min read

తప్పు చేసిన వారికి సినిమా చూపిస్తా

వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిజిటల్ ఉద్యమానికి తెరలేపేందుకు రెడీ అవుతున్నారు.. త్వరలోనే ఓ యాప్ తీసుకు వస్తున్నామని, అన్యాయం జరిగినా.. తప్పు జరిగినా.. ఆ యాప్లో అప్లోడ్ చేయాలని సూచించార

తప్పు చేసిన వారికి సినిమా చూపిస్తా
వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిజిటల్ ఉద్యమానికి తెరలేపేందుకు రెడీ అవుతున్నారు.. త్వరలోనే ఓ యాప్ తీసుకు వస్తున్నామని, అన్యాయం జరిగినా.. తప్పు జరిగినా.. ఆ యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ సినిమా చూపించడం ఖాయం అని ప్రకటించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో జగన్ యాప్ లో చేసినన కంప్లైంట్ ఆటోమేటిగ్గా డిజిటల్ సర్వర్లోకి వచ్చేస్తుందని చెప్పారు. ఆ ఫిర్యాదులపై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కచ్చితంగా పరిశీలన చేస్తామని వెల్లడించారు. అన్యాయానికి గురైన వారంతా ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొన్నారు. ఆధారాలుగా వీడియోలు, పత్రాలను అప్లోడ్ చేయొచ్చని చెప్పారు.ఆ ఫిర్యాదులపై పరిశీలన జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Andhra Pradesh news
YS Jagan
YSRCP
Digital Movement
Complaint App
Jagan App
PAC Meeting
Citizen Complaint Platform
వైసీపీ పీఏసీ సమావేశం
జగన్ డిజిటల్ యాప్
Scroll for the next article