Politics23rd Sep 12:14 PMSunil Byrisetty1 min read

గ్రేటర్‌ విశాఖ నేతలతో వైయస్‌ జగన్‌ సమావేశం

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్‌ విశాఖపట్నంకు చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ న

గ్రేటర్‌ విశాఖ నేతలతో వైయస్‌ జగన్‌ సమావేశం
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్‌ విశాఖపట్నంకు చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్‌ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై నేతలు, కార్యకర్తలతో వైయస్‌ జగన్‌ చర్చించనున్నారు. అనంతరం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. విజయవాడలో శాప్‌ కార్యాలయం వద్ద వైయస్సార్‌సీపీ నాయకులపై దాడి ఘటనపై ఫిర్యాదు చేయనున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని కోరనున్నారు.
Scroll for the next article