Politics25th Dec 04:24 PMSunil Byrisetty1 min read
క్రిస్మస్ సందర్భంగా జగన్ ప్రత్యేక ప్రార్థనలు
క్రిస్మస్ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో సందడి చేశారు. గురువారం ఉదయం సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. పులి
క్రిస్మస్ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో సందడి చేశారు. గురువారం ఉదయం సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. పులివెందుల పర్యటనలో భాగంగా జగన్ తన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతి రెడ్డితో కలిసి చర్చికి చేరుకున్నారు. వారితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం జగన్ చర్చి వెలుపల వేచి ఉన్న అభిమానులు, స్థానికులకు అభివాదం చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. జగన్ పర్యటన సందర్భంగా పులివెందులకు వైసీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.