Politics22nd Jan 02:18 PMSunil Byrisetty1 min read
బాబును చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుంది!
దశాబ్దాలుగా నలుగుతున్న భూ వివాదాలకు తమ హయాంలో శాశ్వత పరిష్కారం చూపించామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వందేళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో జరిగిన సర్వే తర్వాత..
దశాబ్దాలుగా నలుగుతున్న భూ వివాదాలకు తమ హయాంలో శాశ్వత పరిష్కారం చూపించామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వందేళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో జరిగిన సర్వే తర్వాత.. మళ్లీ ఆ సాహసం చేసిన ఘనత తమదేనని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఎదుటివారి కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవడంలో సిద్ధహస్తుడని విమర్శించారు. ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. రైతుల సమస్యల పట్ల ఆయనకు ఎప్పుడూ కనీస ఆలోచన లేదని అన్నారు. 22ఏ నిబంధనతో రైతులను ఇబ్బంది పెట్టడం తప్ప, భూముల రీసర్వే చేయాలన్న ఆలోచన నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేసిన ఈ సంస్కరణలు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గవని, ఇది ఎవరూ తుడిచిపెట్టలేని రికార్డు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.