News31st Aug 11:27 AMSunil Byrisetty1 min read

పులివెందులలో జగన్‌ పర్యటన

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో కడప జిల్లాలో ఉండనున్నారు. సెప్టెంబర్‌ 2 న దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్‌ రాజశేఖ

పులివెందులలో జగన్‌ పర్యటన
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో కడప జిల్లాలో ఉండనున్నారు. సెప్టెంబర్‌ 2 న దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. 2న పులివెందుల నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.15 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. వైఎస్సార్ ఘాట్‌ వద్ద రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి లింగాల మండలం అంబకపల్లి చేరుకుని గంగమ్మ కుంట వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం పులివెందుల చేరుకుని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. 3న ఉదయం 7 గంటలకు పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు.
Andhra Pradesh Politics
YS Jagan
Pulivendula
YSRCP
YS Rajasekhar Reddy Death Anniversary
YSR Ghat
Iddupulapaya
Kadapa District
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి
పులివెందులలో జగన్‌ పర్యటన
Scroll for the next article