Politics5th Apr 02:59 PMSunil Byrisetty1 min read

8న రాప్తాడుకు మాజీ సీఎం జ‌గ‌న్‌ రాప్తాడు పర్యటన ఖరారు

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జ‌గ‌న్‌ రాప్తాడు పర్యటన ఖరారైంది. ఇటీవల పాపిరెడ్డిపల్లిలో ప్రత్యర్థుల చేతిలో మరణించిన లింగమయ్య కుటుంబాన్ని జగన్ ప‌రామ‌ర్శించనున్నారు. ఇప్పటికే లింగమయ

8న రాప్తాడుకు మాజీ సీఎం జ‌గ‌న్‌ రాప్తాడు పర్యటన ఖరారు
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జ‌గ‌న్‌ రాప్తాడు పర్యటన ఖరారైంది. ఇటీవల పాపిరెడ్డిపల్లిలో ప్రత్యర్థుల చేతిలో మరణించిన లింగమయ్య కుటుంబాన్ని జగన్ ప‌రామ‌ర్శించనున్నారు. ఇప్పటికే లింగమయ్య కుటుంబానికి ఫోన్ చేసిన జగన్ వారికి ధైర్యం చెప్పారు. లింగమయ్య హత్యను ఖండించారు. తానే స్వయంగా వచ్చి పరామర్శిస్తానని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8న రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. అయితే లింగమయ్య హత్య అనంతపురం జిల్లాలో సంచలనంగా మారింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ అంశంపై వైసీపీ, టీడీపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే జ‌గ‌న్ ప‌ర్యట‌న‌ను అడ్డుకుంటామ‌ని ప‌రిటాల వ‌ర్గం హెచ్చరించింది. జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
YS Jagan
Rapthadu
Kuruba Lingamaiah Family
YSRCP
పాపిరెడ్డిపల్లి
జ‌గ‌న్ ప‌ర్యట‌న‌
Scroll for the next article