Politics2nd Nov 12:22 PMSunil Byrisetty1 min read

జోగి రమేష్ అరెస్టును ఖండించిన వైఎస్ జగన్

మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారన్నారు. అక్రమ మద్యం కేసులో ఆదివారం ఉద

జోగి రమేష్ అరెస్టును ఖండించిన వైఎస్ జగన్
మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారన్నారు. అక్రమ మద్యం కేసులో ఆదివారం ఉదయం జోగి రమేష్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాశీబుగ్గలో తొక్కిసలాట, తుఫాన్‌లో ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికే ఈ అక్రమ అరెస్ట్ అని వ్యాఖ్యానించారు. కల్తీ మద్యం కేసులో పట్టుబడ్డవారిలో అంతా టీడీపీ వాళ్లేనని ఆరోపించారు. మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెప్తే అది చేస్తుందని వైఎస్ జగన్ విమర్శించారు.
Andhra Pradesh Politics
YS Jagan
Jogi Ramesh
Arrest
TDP
YCP
Illegal Liquor Case
కాశీబుగ్గ తొక్కిసలాట
తుఫాన్ సహాయ చర్యలు
రాజకీయ వివాదం
Scroll for the next article