News24th Mar 01:52 PMSunil Byrisetty1 min read

అరటి రైతుకు దిక్కెవరు? మానవత్వం లేదా?

అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ డిమాండ్ చేశారు. కడప జిల్లా పులివెందులలో ఆయన పర్యటించి అరటి రైతులను పరామర్

అరటి రైతుకు దిక్కెవరు? మానవత్వం లేదా?
అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ డిమాండ్ చేశారు. కడప జిల్లా పులివెందులలో ఆయన పర్యటించి అరటి రైతులను పరామర్శించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు. వర్షం, వడగళ్లు, గాలికి 4000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. పార్ణపల్లె, ఏగువపల్లె, కోమటీనూతల, తాతిరెడ్డిపల్లి గ్రామాల్లో అరటి పంటలు దెబ్బతిన్నాయన్నారు. దాదాపుగా రైతన్నలు రూ. 15 లక్షలు చొప్పున నష్ట పోయారని పేర్కొన్నారు. గతంలో పంటల బీమా ఉచితంగా అందించామని, కూటమి ప్రభుత్వం ఆ పథకం ఎత్తేసిందని మండిపడ్డారు. చంద్రబాబు పుణ్యాన ఖరీఫ్‌లో పంట నష్టం చూశామని, వెంటనే ప్రభుత్వం మానవతా దృక్పదంతో స్పందించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులను రైతు భరోసా కింద ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలో పులివెందుల అరటి సాగుకు నెంబర్ వన్ అని, తమ ప్రభుత్వ హయాంలో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ నిర్మించామని జగన్ తెలిపారు. కానీ, యూజర్ ఏజెన్సీని ఎంపిక చేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని దుయ్యబట్టారు. నెల క్రితం రూ. 26 వేలు పలికిన అరటిని ప్రస్తుతం అడిగేవారు లేరన్నారు. అరటి రైతులకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నానని, ఇన్సూరెన్స్ వచ్చేలా కృషి చేస్తానని జగన్ అన్నారు.
YCP Party
YS Jagan Comments TDP Party
Kadapa
అరటి రైతులను
Scroll for the next article