Politics5th Mar 12:52 PMSunil Byrisetty1 min read

బడ్జెట్‌పై స్పందించిన మాజీ సీఎం జగన్

కూటమి అధికారంలోకి వచ్చాక రెండు బడ్జెట్‌లు పెట్టారని మాజీ సీఎం జగన్ అన్నారు. బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించిన జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. 2 బడ్జెట్లలోనూ ప్రజలను చంద్రబాబ

బడ్జెట్‌పై స్పందించిన మాజీ సీఎం జగన్
కూటమి అధికారంలోకి వచ్చాక రెండు బడ్జెట్‌లు పెట్టారని మాజీ సీఎం జగన్ అన్నారు. బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించిన జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. 2 బడ్జెట్లలోనూ ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నట్టుగా బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. ఆత్మస్తుతి-పరనింద అన్నట్టుగా బడ్జెట్ ప్రసంగం ఉందన్నారు. హామీల గురించి అడిగితే ప్రభుత్వం నుంచి సమాధానం లేదని మండిపడ్డారు. మొదటి బడ్జెట్‌లో హామీలకు కేటాయించిందేమీ లేదని, రెండో బడ్జెట్‌లోనూ అరకొర కేటాయింపులేనని జగన్ విమర్శలు చేశారు.
YS Jagan Mohan Reddy
YCP
AP Budget
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
వైసీపీ
ఏపీ బడ్జెట్
Scroll for the next article