Politics13th Aug 01:33 PMSunil Byrisetty1 min read
రేవంత్, చంద్రబాబుపై జగన్ ఆరోపణలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏపీలో ఓట్ చోరీపై వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. బుధవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్సులో రాహుల్ గాంధీ, మాణిక్యం ఠాకూర్ పై తీవ్ర వ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏపీలో ఓట్ చోరీపై వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. బుధవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్సులో రాహుల్ గాంధీ, మాణిక్యం ఠాకూర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశమంతా ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు కానీ ఆంధ్రా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అందుకు కారణం చంద్రబాబుతో హాట్ లైన్లో టచ్ లో ఉండటమేనని చెప్పారు. ఆంధ్రా ఇంచార్జి, జాతీయ అధికార ప్రతినిధి మాణిక్యం ఠాకూర్ కూడా ఏరోజూ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తూ, చంద్రబాబు స్కాములు చేస్తుంటే ఏ రోజైనా ప్రశ్నించారా అనడిగారు. కానీ జగన్ గురించి మాత్రం మాట్లాడతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, రేవంత్, కాంగ్రెస్ హైకమాండ్ అన్నట్లుగా ఉందన్నారు. ఆంధ్రాలో అంతకన్నా పెద్ద స్థాయిలో 12.5 శాతం ఓట్ చోరీ జరిగినా రాహుల్ గాంధీ మాట్లాడటం లేదన్నారు. ఇవో పార్టీలు, వీరికో అజెండా అంటూ ఉందా అని నిలదీశారు.