Politics28th May 03:41 PMSunil Byrisetty1 min read
మహానాడు పెద్ద డ్రామా!
కడప వేదికగా టీడీపీ మహానాడు జరుగుతోన్న వేళ.. సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్. మహానాడు పెద్ద డ్రామాగా అభివర్ణించిన ఆయన.. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము
కడప వేదికగా టీడీపీ మహానాడు జరుగుతోన్న వేళ.. సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్. మహానాడు పెద్ద డ్రామాగా అభివర్ణించిన ఆయన.. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా..? అని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయి.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారని పేర్కొన్నారు. టీడీపీ తెలుగు డ్రామా పార్టీ అంటూ కొత్త నిర్వచనం చెప్పారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు.. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది.. కడపలో మహానాడు పెట్టి.. జగన్ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది..? అని నిలదీశారు.