Politics8th Jan 05:39 PMSunil Byrisetty1 min read
పరిశ్రమలు అప్పుడు కాదు.. ఇప్పుడు భయపడుతున్నాయి
వైయస్సార్సీపీ హయాంలో పరిశ్రమలు, పారిశ్రామిక వేత్తలు తరలి వెళ్లారని టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఖండించారు. ఆర్‌బీఐ విడుదల చేసిన రిపోర్టులో.. 2019-24 స
వైయస్సార్సీపీ హయాంలో పరిశ్రమలు, పారిశ్రామిక వేత్తలు తరలి వెళ్లారని టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఖండించారు. ఆర్‌బీఐ విడుదల చేసిన రిపోర్టులో.. 2019-24 సమయంలో మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)లో తయారీ రంగంలో భారత్‌లోనే రాష్ట్రం ఐదవ స్థానంలో ఉందని ప్రకటించిందన్నారు. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీది అగ్రస్థానమన్నారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం వైసీపీ హయాంలో పరిశ్రమలు తరలిపోయాయని ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరిపోతున్నారన్నది వాస్తవమని తేల్చి చెప్పారు. సజ్జన్ జిందాల్, మైహోం సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రామ్‌కో సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, భారతి సిమెంట్స్‌తో పాటు ఇతర పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా,ఏ జిల్లాలోనైనా చంద్రబాబుకు కప్పం కట్టకపోతే నడపలేరని జగన్ తెలిపారు.