Politics20th Jul 02:19 PMSunil Byrisetty1 min read

రోజాపై వ్యాఖ్యలు.. జగన్ సీరియస్!

మాజీ మంత్రి, సినీ నటి ఆర్కే రోజాపై వ్యాఖ్యల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైసీపీ అధినేత జగన్ స్పందించారు. టీడీపీ దుష్ట సం

రోజాపై వ్యాఖ్యలు.. జగన్ సీరియస్!
మాజీ మంత్రి, సినీ నటి ఆర్కే రోజాపై వ్యాఖ్యల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైసీపీ అధినేత జగన్ స్పందించారు. టీడీపీ దుష్ట సంస్కృతికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా సోదరి రోజాపై భానుప్రకాశ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. భానుప్రకాశ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. మాజీ మంత్రి రోజాపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం. తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకూ ఓర్చుకోలేక, రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన నా సోదరి రోజాను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించారని మండిపడ్డారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదని, ఉద్దేశపూర్వకంగా చేసినవని పేర్కొన్నారు.
Andhra Pradesh news
Roja Selvamani
TDP Controversy
YCP vs TDP
Gali Bhanu Prakash
రోజాపై వ్యాఖ్యలు జగన్ సీరియస్
Scroll for the next article