Politics13th Aug 05:53 PMSunil Byrisetty1 min read
అధికార దుర్వినియోగానికి పరాకాష్ట
రాష్ట్రంలో చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. దాడి కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ఆయన
రాష్ట్రంలో చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. దాడి కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. కుట్ర రాజకీయాలు చేస్తూ.. విరూపాక్షిని అరెస్ట్ చేయించారని.. అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో ఉందో విరూపాక్షి అక్రమ అరెస్టే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఏపీలో బాధితులే నిందితులవుతున్నారని వ్యాఖ్యానించారు. దాడికి గురైనవారిపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బాధితులకు ఎవరైనా అండగా నిలబడితే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిని ధ్వంసం చేసి మరీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్‌లో వందల మంది పోలీసులు విరూపాక్షి ఇంటి కిటీకీలను ధ్వంసం చేశారని, తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారనిజగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.