Politics12th Mar 11:38 AMSunil Byrisetty1 min read

మళ్లీ వచ్చేది మనమే. మన పార్టీనే: వైయస్‌ జగన్‌

"వైయస్సార్‌సీపీ ఎప్పుడు కూడా ప్రజలకు తోడుగా ఉంటుంది. వారికి ఎప్పుడు కూడా అండగా నిలబడుతుంది. ప్రజల తరపున ఎప్పుడూ గొంతుకై, వారికి అండగా ఉంటుందని మరోసారి తెలియజేస్తూ.. ఈరోజు నిరసన కార

మళ్లీ వచ్చేది మనమే. మన పార్టీనే: వైయస్‌ జగన్‌
"వైయస్సార్‌సీపీ ఎప్పుడు కూడా ప్రజలకు తోడుగా ఉంటుంది. వారికి ఎప్పుడు కూడా అండగా నిలబడుతుంది. ప్రజల తరపున ఎప్పుడూ గొంతుకై, వారికి అండగా ఉంటుందని మరోసారి తెలియజేస్తూ.. ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, మీ అందరికి కూడా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే విధంగా పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీలో ప్రతి నాయకుడు, కార్యకర్తకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నానం"టూ వైయస్‌ జగన్‌ క్లుప్తంగా ప్రసంగించారు. "వైయస్సార్‌సీపీ స్థాపించి 15 ఏళ్లు అవుతోంది. 14 ఏళ్ల వైయస్సార్‌సీపీ ప్రయాణంలో మొదటి రోజు నుంచి.. ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచి.. ప్రజల కష్టాలను వైయస్సార్‌సీపీ తమ కష్టాలుగా భావించి, ప్రజల తరపున వాయిస్‌ ఆఫ్‌ వాయిస్‌లెస్‌ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూ వస్తోంది. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 ఏళ్లు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. అధికార పక్షానికి ధీటైన సమాధానం ఇస్తూనే వస్తున్నామ’’ని జగన్ పేర్కొన్నారు.
YSRCP
Jagan
Formation Day
వైయస్సార్‌సీపీ
Scroll for the next article