Politics19th Nov 01:44 PMSunil Byrisetty1 min read

తాడేపల్లి టు బెంగళూరు మధ్యలో నాంపల్లి !

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ లో సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ను వ్యక్తిగత సిబ్బంది విడుదల చేశారు. వైఎస్ జగన్ ఉదయం తొమ్మిది గంటలకు తాడేపల్లిలో బయ

తాడేపల్లి టు బెంగళూరు మధ్యలో నాంపల్లి !
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ లో సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ను వ్యక్తిగత సిబ్బంది విడుదల చేశారు. వైఎస్ జగన్ ఉదయం తొమ్మిది గంటలకు తాడేపల్లిలో బయలుదేరతారు. ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. అక్కడ్నుంచి నాంపల్లి కోర్టుకు పదకొండున్నరకు చేరుకుంటారు. పన్నెండున్నర వరకు కోర్టులో ఉంటారు. తర్వాత అక్కడ్నుంచి లోటస్ పాండ్ కు వెళ్తారు. జగన్ మోహనరెడ్డి లోటస్ పాండ్ ఇంటికి వెళతారు. కోర్టు నుంచి లోటస్ పాండ్ కు వచ్చి గంట సేపు ఉండి..భోజనం చేసి.. మళ్లీ బేగంపేటకు వెళ్తారు. ప్రత్యేక విమానంలో విజయవాడకు కాకుండా బెంగళూరు వెళ్తారు. అక్కడి నుంచి యలహంక ఇంటికి వెళ్తారు.
Andhra Pradesh
YS Jagan
CBI court
Hyderabad
Tadepalli
Begumpet
Nampally
Lotus Pond
Bengaluru
Yelahanka
నాంపల్లి కోర్టు
సీబీఐ కోర్టు
తాడేపల్లి
బేగంపేట విమానాశ్రయం
Scroll for the next article