News7th Oct 04:24 PMSunil Byrisetty1 min read

వైసీపీ ముఖ్యనేతల సమావేశంలో కీలక నిర్ణయాలు

వైయస్ జగన్ నేతృత్వంలో నిర్వహించిన వైసీపీ ముఖ్యనేతల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగ

వైసీపీ ముఖ్యనేతల సమావేశంలో కీలక నిర్ణయాలు
వైయస్ జగన్ నేతృత్వంలో నిర్వహించిన వైసీపీ ముఖ్యనేతల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించేలా కార్యాచరణ ప్రకటించారు. రచ్చబండ, కోటి సంతకాల సేకరణ, గవర్నర్‍ని కలవడం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 10 నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమాలు జరగనున్నాయి. నియోజకవర్గాల్లో 28న నిరసన ర్యాలీలు, జిల్లా కేంద్రాల్లో నవంబర్ 12న ధర్నాలు చేపట్టనున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేల సంతకాలు సేకరణ చేపట్టనున్నారు. నవంబర్ 26న గవర్నర్‍ను కలవాలని నిర్ణయించారు.
Andhra Pradesh
YSRCP meeting
Jagan Mohan Reddy
YSR Congress Party
key decisions
medical colleges privatization
statewide protests
Rachabanda program
వైసీపీ వ్యూహం
వైసీపీ సమావేశం
వైఎస్ జగన్
Scroll for the next article