News13th Jul 10:32 AMSunil Byrisetty1 min read

రేపు, ఎల్లుండి జగన్ వరుస పర్యటనలు

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు రోజుల పాటు విశాఖపట్నం, భీమవరం జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు (జూలై 14) విశాఖలో ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన

రేపు, ఎల్లుండి జగన్ వరుస పర్యటనలు
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు రోజుల పాటు విశాఖపట్నం, భీమవరం జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు (జూలై 14) విశాఖలో ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాపాయంతో బయటపడిన కారి చిన్నాను కూడా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి కార్యక్రమాలు ముగిసిన అనంతరం తిరిగి చేరుకుంటారు. ఎల్లుండి (జూలై 15) పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులను కలిసి వారి సమస్యలు, నష్టాలపై ప్రత్యక్షంగా వివరాలు సేకరించనున్నారు. గిట్టుబాటు ధరలు, పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, విద్యుత్ ఛార్జీలు, ఎగుమతి ఇబ్బందులపై రైతులతో చర్చించి వారికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.
Andhra Pradesh
Visakhapatnam
YS Jagan
YS Jagan Mohan Reddy
YSRCP
Bhimavaram
Boat Accident
Fishermen
ఆంధ్రప్రదేశ్
ఏపీ రాజకీయాలు
జగన్ పర్యటన
పశ్చిమ గోదావరి
ఆక్వా పరిశ్రమ
Scroll for the next article