News30th Jul 06:07 PMSunil Byrisetty1 min read
నెల్లూరులో జగన్ పర్యటన రేపు
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ నెల్లూరులో పర్యటించనున్నారు. నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిసి మాట్లాడనున్నారు. అ
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ నెల్లూరులో పర్యటించనున్నారు. నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిసి మాట్లాడనున్నారు. అనంతరం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో ఆయన, కుటుంబ సభ్యులతో జగన్ భేటీ కానున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నెల్లూరు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. కాగా ఇటీవల జగన్ పర్యటనల్లో చోటు చేసుకున్న ఘటనల దృష్ట్యా పోలీసులు పది మందికి మించి హాజరు కాకూడదని నోటీసులు జారీ చేశారు.