Politics22nd Oct 12:10 PMSunil Byrisetty1 min read
వైఎస్ జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారు!
ఏపీలో నూటికి నూరుపాళ్లు వైఎస్ జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో హింసాత్మక వాతావరణం నెలకొందని, ఎన్నికల ప్రక్రియ తాత
ఏపీలో నూటికి నూరుపాళ్లు వైఎస్ జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో హింసాత్మక వాతావరణం నెలకొందని, ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా ఆగింది, ఇది మళ్లీ కొనసాగుతుందని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగించాలన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వీల్లేదని పోలీసులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు మీద ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని, వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు తరువాతనే ఎన్నికల కమిషన్ లైన్ లోకి వచ్చిందన్నారు. తండ్రీకొడుకుల పాలనలో రాష్ట్రంలో దుర్మార్గపు పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు.