News9th Oct 11:15 AMSunil Byrisetty1 min read

విశాఖ జిల్లాలో జగన్ పర్యటన

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించి మాట్లాడనున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పరిరక్షించేలా, ప్రైవేటీకరణకు వ్యతిరేకం

విశాఖ జిల్లాలో జగన్ పర్యటన
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించి మాట్లాడనున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పరిరక్షించేలా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపట్టనున్నారు. అయితే నేడు విశాఖలో మహిళల ప్రపంచకప్ క్రికెట్ భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ జరగనున్నందున కాన్వాయ్ లో 10కి మించి వాహనాలు ఉండకూడదని పోలీసులు షరతులు విధించారు. రోడ్ షో నిర్వహించడం, కూడళ్ల వద్ద ప్రసంగాలు చేయకూడదని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే జగన్ విశాఖ చేరుకోగా, రోడ్డు మార్గంలో నర్సీపట్నం వెళ్తున్నారు.
Andhra Pradesh Politics
Jagan
Visakhapatnam
YSRCP
Narsipatnam Medical College
Public Movement
Privatization Protest
Police Restrictions
Women's World Cup
India vs South Africa Match
విశాఖ జిల్లాలో జగన్ పర్యటన
Scroll for the next article