News11th Jun 04:39 PMSunil Byrisetty1 min read
నాడు రైతురాజ్యం.. నేడు కష్టాలమయం
ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించిన మాజీ సీఎం వైఎస్ జగన్.. పొగాకు రైతులను పరామర్శించి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించిన మాజీ సీఎం వైఎస్ జగన్.. పొగాకు రైతులను పరామర్శించి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఆరోపించారు. కొండెపి, పర్చూరులో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని, ఏ రైతు చూసినా తక్కువ ధరలకు తమ పంటలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైఎస్ జగన్ మండిపడ్డారు. వరి, మిర్చి, పొగా పంట చూసినా గిట్టుబాటు ధర లేదని జగన్ పేర్కొన్నారు. గత ఏడాది వైసీపీ పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చామని, పంట వేసే సమయంలోనే రైతన్నలకు రైతు భరోసా అందించామని గుర్తు చేశారు. గతేడాది రైతు భరోసా కింద ఇస్తున్న సొమ్ము ఆగిపోయిందని, మోదీ ఇచ్చే ఆరు వేలు కాక.. మరో 20 వేలు ఇస్తామని చెప్పారని, నేడు జూన్ వచ్చినా ఇంత వరకు రైతులకు పెట్టుబడి సాయం అందలేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వం మాత్రం రైతులను పూర్తిగా గాలికి వదిలేసిందని జగన్ ఆరోపణలు చేశారు.