News30th May 06:07 PMSunil Byrisetty1 min read
జూన్ 3న తెనాలికి జగన్
జూన్ 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధినేత YS.జగన్మోహన్ రెడ్డి తెనాలికి రానున్నారు. తెనాలిలో దళిత, ముస్లిమ్ మైనారిటీ విద్యార్థులపై పోలీసులు బహిరంగ ప్రదేశాల
జూన్ 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధినేత YS.జగన్మోహన్ రెడ్డి తెనాలికి రానున్నారు. తెనాలిలో దళిత, ముస్లిమ్ మైనారిటీ విద్యార్థులపై పోలీసులు బహిరంగ ప్రదేశాలలో థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు వీడియో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తెనాలి పట్టణ ఐతానగర్ ప్రధాన కూడళ్ళలో ప్రజలకు భయబ్రాంతులు కలుగజేసేలాగా ప్రవర్తిస్తూ రాజ్యాంగ, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన ఘటనపై స్పందిస్తూ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించాలని జగన్ నిర్ణయించినట్లు పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. తెనాలిలో జరిగిన విషయాలను తెలుసుకోవడానికి YS.జగన్మోహన్ రెడ్డి జూన్ 3వ తారీఖున వస్తున్నారని పేర్కొంది. మరోవైపు ఇప్పటికే ఈ ఘటనపై పలువురు వైసీపీ నేతలు స్పందించి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.