Politics30th Jun 05:19 PMSunil Byrisetty3 min read
పేరుకు రూపాయి.. ప్యాలస్ ఖర్చు కోట్లు..!
సీఎంగా రూపాయి జీతం తీసుకుంటాన్న మాజీ సీఎం జగన్ తన ప్యాలస్ మీద పెట్టిన ఖర్చు మాత్రం వందల కోట్లు దాటింది. ప్రజల సొమ్మును డైరెక్ట్‌గా జీవోల రూపంలో చేసిన ఖర్చు చూస్తే కళ్లు తేలేయడం ఖాయ
సీఎంగా రూపాయి జీతం తీసుకుంటాన్న మాజీ సీఎం జగన్ తన ప్యాలస్ మీద పెట్టిన ఖర్చు మాత్రం వందల కోట్లు దాటింది. ప్రజల సొమ్మును డైరెక్ట్‌గా జీవోల రూపంలో చేసిన ఖర్చు చూస్తే కళ్లు తేలేయడం ఖాయం.
జీఓ నెంబర్ : 160తో లోటస్ పాండ్ లో ఉన్న జగన్ ఇంటికి సిసి కెమెరాల ఖర్చు : రూ.12.50 లక్షలు, బాత్ రూమ్ కోసం : రూ.12 లక్షలు
జీఓ నెంబర్ : 279తో తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ "వ్యూ కట్టర్" కోసం రూ:3.25 కోట్లు .
జీవో నెంబర్ : 139తో తాడేపల్లి ప్యాలెస్ లో 24 గంటలు ఒక ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండటానికి : రూ.8.50 లక్షలు
జీవో నెంబర్ : 146తో తాడేపల్లి ప్యాలెస్ లో ట్రాన్స్ ఫార్మర్ కోసం : రూ.97 లక్షలు, సిసిటీవీ, సోలార్ ఫెన్సింగ్ కోసం రూ.1.25 కోట్లు, ఏసి పెట్టటానికి రూ.80 లక్షలు, 320 KVA DG సెట్ కోసం : రూ.39 లక్షలు, లైట్ లు పెట్టటానికి : రూ.11.50 లక్షలు
ఏపీ సెక్రటేరియట్ లో ఉన్న ఇన్వర్టర్ పీక్కుని వచ్చి, తాడేపల్లి ప్యాలెస్ లో బిగించటానికి : రూ.11 లక్షలు
జీవో నెంబర్ : 132తో జగన్ ఇంటికి వెళ్ళే రోడ్డు వేయటానికి, 1 కిమీ రోడ్డుకి, : రూ.5 కోట్లు
జీవో నెంబర్ : 308తో జగన్ ఇంట్లో కుర్చీలు, టేబుల్స్ కొనటానికి రూ.39 లక్షలు
జీవో నెంబర్ : 133తో తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలిప్యాడ్ దాకా వెళ్ళటానికి, రోడ్డుకి ఫెన్సింగ్ వేయటానికి రూ.40 లక్షలు, శాశ్వత ఐరన్ ఫ్రేమ్స్ తో గ్రిల్స్ పెట్టటానికి : రూ.75 లక్షలు, దొడ్లు కట్టటానికి : రూ.43.50 లక్షలు, జగన్ ఇంటి చుట్టూ సెక్యూరిటీ పోస్ట్స్, గేట్స్ శాశ్వతంగా పెట్టటానికి రూ.31 లక్షలు
జీవో నెంబర్ : 329తో తాడేపల్లి ప్యాలెస్ లో కూలర్ లు పెట్టటానికి రూ.22.50 లక్షలు
జీవో నెంబర్ : 330తో తాడేపల్లి ప్యాలెస్ లో కిటికీలు పెట్టటానికి రూ.73 లక్షలు
జీవో నెంబర్ : 329తో జగన్ ప్రమాణస్వీకారానికి ఎలెక్ట్రికల్ లైటింగ్ పెట్టటం కోసం : రూ.22 లక్షలు
జీవో నెంబర్ : 1737తో జగన్ వ్యక్తిగత పర్యటన కోసం, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయటానికి, జెరూసలెం వెళ్ళినందుకు : రూ.22.52 లక్షలు
జీవో నెంబర్ : 254తో తాడేపల్లి ప్యాలెస్ లో తాత్కాలిక పనులు కోసం ఖర్చు : రూ.22.50 లక్షలు
జీవో నెంబర్ : 1609తో జగన్ ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి ఉండటానికి, బెజవాడలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ అద్దె కోసం, లక్ష రూపాయలు. మళ్ళీ 5 వేలు ఖర్చుల కోసం కూడా
జీవో నెంబర్ : 1742తో బూడి ముత్యాల నాయుడు ఉండటానికి, బెజవాడలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ అద్దె కోసం, లక్ష రూపాయలు. మళ్ళీ 5 వేలు ఖర్చుల కోసం
జీవో నెంబర్ : 1741తో దాడిశెట్టి రాజా ఉండటానికి, బెజవాడలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ అద్దె కోసం, లక్ష రూపాయలు. మళ్ళీ 5 వేలు ఖర్చుల కోసం
జీవో నెంబర్ : 1743తో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఉండటానికి, బెజవాడలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ అద్దె కోసం, లక్ష రూపాయలు. మళ్ళీ 5 వేలు ఖర్చుల కోసం
సాక్షిలో పని చేసే ఉద్యోగులకు, ప్రభుత్వం నుంచి జీతాలు
సజ్జలకు ఇంట్లో టీ కప్పులు కొనుక్కోవటానికి రూ.1.50 లక్షలు, ఇంట్లో ఫర్నిచర్ కొనుక్కోవటానికి రూ.3 లక్షలు
ఇలా ప్రజల సొమ్మును పటికబెల్లంలా జీవోలతో వాడేశారు.