Politics11th Mar 02:35 PMSunil Byrisetty1 min read

మాట తప్పి మోసం చేయడం అంటే ఇదే

అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నారు. అంగన్వాడీల గొంతు నొక్కి, ఆందోళలను అణిచివేయడం కూటమి ప్రభుత్వ నియంత చేష్టల

మాట తప్పి మోసం చేయడం అంటే ఇదే
అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నారు. అంగన్వాడీల గొంతు నొక్కి, ఆందోళలను అణిచివేయడం కూటమి ప్రభుత్వ నియంత చేష్టలకు పరాకాష్ట అని మండిపడ్డారు. అంగన్వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవన్నారు. వెంటనే వారిని పిలిచి ప్రభుత్వం చర్చించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు నెలకు గౌరవ వేతనం రూ.26వేలు ఇవ్వాలన్నారు. తక్షణం గ్రాట్యూటి చెల్లింపు హామీని అమలు చేయాలని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. హెల్పర్ల పదోన్నతిపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని, పెండింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విధి నిర్వహణలో అంగన్వాడీలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగంతో పాటు మట్టి ఖర్చుల కింద రూ.20వేలు ఇవ్వాలన్నారు. వీటితో పాటు ఇతర 12 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై ప్రకటన చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని షర్మిల పేర్కొన్నారు.
Anganwadi Workers
Congress
YS Sharmila
Pressmeet
Vijayawada
Amaravati
అంగన్వాడీ
కాంగ్రెస్
వైఎస్ షర్మిల
ప్రెస్మీట్
విజయవాడ
అమరావతి
Scroll for the next article