Politics17th Oct 02:37 PMSunil Byrisetty1 min read

ఎన్నికల వేళ రెండు పార్టీల అరాచకాలు

స్థానిక సంస్థల ఎన్నికల వేళ TDP, YCPలు దాష్టీక రాజకీయాలు సాగిస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. నాడు YCP హయాంలో హింసాకాండ.. నేడు TDP హయాంలో అంతకుమించిన ఘోరకలి

ఎన్నికల వేళ రెండు పార్టీల అరాచకాలు
స్థానిక సంస్థల ఎన్నికల వేళ TDP, YCPలు దాష్టీక రాజకీయాలు సాగిస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. నాడు YCP హయాంలో హింసాకాండ.. నేడు TDP హయాంలో అంతకుమించిన ఘోరకలి అంటూ ట్వీట్ చేశారు. ప్రతీకార రాజకీయాలతో రతనాల సీమను రక్తసీమగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాయచోటి, పుంగనూరులో చోటుచేసుకున్న ఘటనలు రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఆందోళనకరమైన పరిణామాలన్నారు. రాజకీయాలంటే ప్రజల అభివృద్ధి కోసం పోటీ పడాలి కానీ, భౌతిక దాడులకు పాల్పడటం కాదని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టి TDP సాగిస్తున్న ఈ దౌర్జన్య వైఖరిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. బలవంతపు ఏకగ్రీవాలు ఎందుకు? నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమెందుకని ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు శాఖ బాధ్యత ఏమైందని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేశారు.
Scroll for the next article