Politics8th Sep 03:25 PMSunil Byrisetty1 min read
రాజకీయాల్లోకి రాజారెడ్డి
వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి రాజకీయ ఎంట్రీపై క్లారిటీ వచ్చింది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయ ఎంట్రీపై స్పందించారు. తన కుమారుడు అవసరమైనప్ప
వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి రాజకీయ ఎంట్రీపై క్లారిటీ వచ్చింది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయ ఎంట్రీపై స్పందించారు. తన కుమారుడు అవసరమైనప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని స్పష్టం చేశారు. దీంతో రాజారెడ్డి రాజకీయ ప్రవేశం ఖాయమైంది. అయితే రాజారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా.. లేదా షర్మిలతో కలిసి కొత్త పార్టీ స్థాపిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. కర్నూలులో పర్యటిస్తున్న షర్మిల వెంట రాజారెడ్డి కనిపించడంతో చర్చ మొదలైంది.