News9th Nov 04:24 PMSunil Byrisetty1 min read

బనకచర్ల ప్రాజెక్ట్.. భారీ అవినీతికి స్కెచ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టు కేవలం భారీ అవినీతికి వేసిన పథకమని, ముఖ్యమంత

బనకచర్ల ప్రాజెక్ట్.. భారీ అవినీతికి స్కెచ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టు కేవలం భారీ అవినీతికి వేసిన పథకమని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇదొక ఏటీఎంలా పనిచేస్తుందని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆమె 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. "బనకచర్ల, నల్లమల సాగర్.. పోలవరం లింక్ ప్రాజెక్టుకు అనుమతులు రాకున్నా చంద్రబాబు ఆశ మాత్రం చావలేదు. ప్రాజెక్టుల అనుసంధానంపై ఉన్న శ్రద్ధ.. పోలవరం పూర్తి చేయడంపై లేదు," అని షర్మిల తన పోస్టులో పేర్కొన్నారు. నిపుణులు వద్దంటున్నా డీపీఆర్‌ల పేరుతో హడావుడి చేయడం వెనుక ఆంతర్యమేమిటని ఆమె ప్రశ్నించారు.
Andhra Pradesh
YS Sharmila
Chandrababu Naidu
Banakacharla Project
పోలవరం లింక్‌
అవినీతి ఆరోపణలు
ఏపీసీసీ
నల్లమల సాగర్‌
Scroll for the next article