Politics22nd Sep 03:56 PMSunil Byrisetty1 min read
GSTతో దోచింది కొండంత.. తగ్గింపు గోరంత
జీఎస్టీతో దోచింది కొండంత, తగ్గింపు గోరంత అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మండిపడ్డారు. 8 ఏళ్లలో మోడీ మోపిన గబ్బర్ సింగ్ ట్యాక్స్ భారం అక్షరాల 55.44 లక్షల కోట్లు అన్నారు.
జీఎస్టీతో దోచింది కొండంత, తగ్గింపు గోరంత అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మండిపడ్డారు. 8 ఏళ్లలో మోడీ మోపిన గబ్బర్ సింగ్ ట్యాక్స్ భారం అక్షరాల 55.44 లక్షల కోట్లు అన్నారు. 2.O సంస్కరణల ముసుగులో తగ్గింపు విలువ కేవలం 2.5లక్షల కోట్లు మాత్రమేనని చెప్పారు. GST పేరుతో చేసిన లోతైన గాయానికి అయింట్మెంట్ రాయాలని చూసే.. బీజేపీ బ్యాండ్ - ఎయిడ్ రాజకీయాలను దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరని వ్యాఖ్యానించారు. GST తాజా సంస్కరణలు బీజేపీ చేసిన ఆర్థిక గాయాలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం కోసమేనని షర్మిల వ్యాఖ్యానించారు.