Politics19th Jun 12:49 PMSunil Byrisetty1 min read

బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకుంటే జగన్ పరామర్శలా?

బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు వైసీపీ అధినేత జగన్ పరామర్శ చేయడం ఏంటని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వారికి విగ్రహాలు కట్టడం ఏమిటని, సమాజం ఎటు పోతుందన

బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకుంటే జగన్ పరామర్శలా?
బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు వైసీపీ అధినేత జగన్ పరామర్శ చేయడం ఏంటని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వారికి విగ్రహాలు కట్టడం ఏమిటని, సమాజం ఎటు పోతుందని నిలదీశారు. జగన్ ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి కానీ బల ప్రదర్శనలు కాదని హితవు పలికారు. జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టి.. అన్ని అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసే కాంగ్రెస్‌కి మాత్రమే ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పర్యటనలకు ఎందుకు ఆంక్షలు లేవో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.
Andhra Pradesh news
Ap politics
Ys jagan
Ys sharmila
jagan tour death
బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకుంటే జగన్ పరామర్శలా
Scroll for the next article