News3rd May 04:07 PMSunil Byrisetty1 min read

అమరావతిలో.. చిచ్చుబుడ్డి తుస్సుమంది!

అమరావతి పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ తీరు చూస్తే చిచ్చుబుడ్డి తుస్సుమందనక తప్పదనిపిస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిల ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్ష

అమరావతిలో.. చిచ్చుబుడ్డి తుస్సుమంది!
అమరావతి పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ తీరు చూస్తే చిచ్చుబుడ్డి తుస్సుమందనక తప్పదనిపిస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిల ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం.. నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని తేల్చి చెప్పారు. విభజన చట్టంలో కేంద్రం విధులేంటో ఇంత స్పష్టంగా పేర్కొంటే.. ప్రధాని మోదీ మనకు ఇస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. ఆనాడు 2015లో మట్టి కొట్టారని, నేడు సున్నం కొట్టి వెళ్ళారని విమర్శించారు. 10 ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో.. నేడు అవే అబద్ధాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారని మండిపడ్డారు. మళ్ళీ "అభివృద్ధి చేస్తాం, భుజాలు కలుపుతాం" అంటూ బూటకపు మాటలు చెప్పారన్నారు. అమరావతి నిర్మాణానికి ఖర్చయ్యే లక్ష కోట్లలో ఒక్క రూపాయి అయినా ప్రకటించారా అనడిగారు. పోనీ విభజన హామీలపై టైమ్ బాండ్ క్లారిటీ ఇచ్చారా అని ప్రశ్నించారు. వీటిపై సీఎం చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
Amaravati
ys sharmila
pm modi
chandrababu
ప్రధాని మోడీ తీరు చూస్తే చిచ్చుబుడ్డి తుస్సు
ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్రా
జధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని
Scroll for the next article