News13th Sep 05:03 PMSunil Byrisetty1 min read

గిరిజన విద్యపై వైఎస్ షర్మిల విమర్శలు

ఆదివాసీ పిల్లలకు అక్షరజ్ఞానం అందించలేని కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. గిరిజన విద్యకు మహర్దశ, పెద్దపీట లాం

గిరిజన విద్యపై వైఎస్ షర్మిల విమర్శలు
ఆదివాసీ పిల్లలకు అక్షరజ్ఞానం అందించలేని కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. గిరిజన విద్యకు మహర్దశ, పెద్దపీట లాంటి మాటలు కేవలం ఆర్భాటాలేనని ఆమె పేర్కొన్నారు. “పెద్దపీట కాదు, ట్రైబల్ వెల్ఫేర్‌పై మీరు వేసింది కత్తిపీట” అంటూ ఆమె ఎద్దేవా చేశారు. మంత్రులుగా మహర్దశ మీకే కానీ, గిరిజన బిడ్డలకు కాదని షర్మిలా అన్నారు. పాఠశాలలు తెరచి మూడు నెలలు గడిచినా ఏజెన్సీ ప్రాంతాల్లోని బడుల్లో ఒక్క ఉపాధ్యాయుడైనా లేకపోవడం ప్రభుత్వం పని చేస్తున్నదా లేదా అనే ప్రశ్నను లేవనెత్తిందీ ఏపీసీసీ చీఫ్. విద్యాశాఖ పని చేస్తున్నదా, లేక నిద్రపోతుందా అని నిలదీశారు.
Andhra Pradesh Politics
YS Sharmila
Tribal Education
AP Congress
Education Crisis
Tribal Welfare
School Infrastructure
Teacher Shortage
గిరిజన విద్యపై వైఎస్ షర్మిల విమర్శలు
Scroll for the next article