News25th Mar 11:39 AMSunil Byrisetty1 min read
పెట్రో ధరలపై టీడీపీ, వైసీపీవి నీచ రాజకీయాలు
ఏపీలో పెట్రోల్ ధర రూ. 109.60 పైసలు. డీజిల్ ధర రూ 97.47 పైసలుగా ఉన్నాయని APCC ఛీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. పొరుగునున్న తమిళనాడు రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.100.86 పైస
ఏపీలో పెట్రోల్ ధర రూ. 109.60 పైసలు. డీజిల్ ధర రూ 97.47 పైసలుగా ఉన్నాయని APCC ఛీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు.
పొరుగునున్న తమిళనాడు రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.100.86 పైసలు. డీజిల్ ధర రూ.92.39 పైసలుగా ఉన్నాయన్నారు.
తమిళనాడుతో పోల్చితే మనదగ్గర పెట్రోల్ మీద 9 రూపాయలు, డీజిల్ మీద 5 రూపాయలు ఎక్కువన్నారు.
కర్ణాటకలో లీటరు పెట్రోల్ ధర రూ.102.90 పైసలు. డీజిల్ ధర రూ.88.99 పైసలుగా ఉన్నాయని, కర్ణాటకతో పోల్చితే ఏపీలో పెట్రోల్ మీద లీటరుకు 7 రూపాయలు, డీజిల్ మీద 9 రూపాయలు ఎక్కువని వివరించారు.
చివరికి పక్కనున్న తెలంగాణలో లీటరు పెట్రోల్ ధర. రూ 107.46 పైసలు. డీజిల్ ధర రూ. 95.70 పైసలు అని తెలిపారు.
తెలంగాణతో పోల్చినా ఏపీలో లీటరు మీద 3 రూపాయలు అదనమన్నారు. పన్నులు ఘనం..
అభివృద్ధి శూన్యం ఇది రాష్ట్ర పరిస్థితి అని విమర్శించారు.
పెట్రోల్, డీజిల్ మీద పన్నులు తగ్గింపుపై టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారపక్షంలో మరో మాట అని షర్మిల విమర్శలు చేశారు.