Politics27th Jun 03:52 PMSunil Byrisetty1 min read

దేశంలో 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ

దేశంలో గడిచిన 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు. సమాజంలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సహజ సంపదను దోచు

దేశంలో 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ
దేశంలో గడిచిన 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు. సమాజంలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సహజ సంపదను దోచుకు తిన్నారన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టారని, మణిపూర్,గోద్రా అల్లర్లు మీ ఎమర్జెన్సీ పాలనకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. ఆ ఎమర్జెన్సీతో పోల్చితే ఈ ఎమర్జెన్సీ ఎక్కువని అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ను మోడీ నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎత్తు తగ్గించి అన్యాయం చేస్తుంటే పార్లమెంట్ లో ప్రశ్నించే ఒక్క మగాడు కూడా లేడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక మహా సముద్రం..పిల్ల కాలువలు అన్ని సముద్రంలో కలవాల్సిందేనని, వైసీపీకి కూడా ఈ సిద్ధాంతం వర్తిస్తుందని తెలిపారు.
Politics news
YS Sharmila
pm modi
undeclared Emergency
BJP critique
ap politics
democratic institutions
polavaram project
Congress
Scroll for the next article