News13th Nov 03:27 PMSunil Byrisetty1 min read

నాడు చదువంటే పండుగ.. నేడు దండుగ

ఫీజు రీయింబర్స్‌మెంట్ అంటే, నాడు YSR హయాంలో పేదవాడి చదువుకు పండుగ.. నేడు చంద్రబాబు పాలనలో వేల కోట్ల బకాయిలతో చదువంటేనే దండుగ అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఓవైపు లక

నాడు చదువంటే పండుగ.. నేడు దండుగ
ఫీజు రీయింబర్స్‌మెంట్ అంటే, నాడు YSR హయాంలో పేదవాడి చదువుకు పండుగ.. నేడు చంద్రబాబు పాలనలో వేల కోట్ల బకాయిలతో చదువంటేనే దండుగ అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఓవైపు లక్షల కోట్ల పెట్టుబడులంటూ భారీ ప్రచారాలు.. మరోవైపు వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, విద్యార్థుల ఆత్మహత్యాయత్నాలు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులకు స్వర్గధామమని చెప్పుకునే రాష్ట్రంలో.. కనీసం పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడానికి దిక్కులేదని వ్యాఖ్యానించారు. విద్యార్థుల ప్రాణాలతో, జీవితాలతో చెలగాటం ఆడుతున్నందుకు కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. గత 3 ఏళ్లుగా రూ.6 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టడమంటే, బిడ్డల చదువులపై చంద్రబాబు గారికున్న చిత్తశుద్ధి ఏమిటో స్పష్టమైందని విమర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లుంచారు. 1. తక్షణం బకాయిలు పడిన రూ. 6,400 కోట్లను ఒకే విడుతలో చెల్లించాలి. 2. సర్టిఫికెట్ల నిలిపివేతపై కఠిన చర్యలు తీసుకోవాలి. 3. విద్యార్థులకు ఎలాంటి షరతులు లేకుండా సర్టిఫికెట్లు అందేలా చూడాలి. 4. విద్యార్థులను, తల్లిదండ్రులకు వేధింపుల నివారణకు కాలేజీలపై ప్రత్యేక కార్యాచరణ అమలు జరగాలి. 5. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ఏ లోటు లేకుండా చూడాలి.
Scroll for the next article