News12th Jul 12:48 PMSunil Byrisetty1 min read

మాటలు, మట్టి తప్ప నిర్మాణాలేవీ?

అమరావతి రాజధానికి 2015లో మోదీ శంకుస్థాపన చేసి, శిలా ఫలకం ఆవిష్కరించి.. మన నోట్లో ఎలా మట్టి కొట్టారో చూద్దామని వచ్చానని ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో

మాటలు, మట్టి తప్ప నిర్మాణాలేవీ?
అమరావతి రాజధానికి 2015లో మోదీ శంకుస్థాపన చేసి, శిలా ఫలకం ఆవిష్కరించి.. మన నోట్లో ఎలా మట్టి కొట్టారో చూద్దామని వచ్చానని ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆమె ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయిందని, మళ్ళీ ఈ మధ్య మోదీ వచ్చారు.. ఆ మాటలు, ఈ మాటలు చెప్పి మట్టి కొట్టి వెళ్లారని విమర్శించారు. మోదీ తీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎబ్బెట్టుగా ఉందన్నారు. 25 వేల మంది రైతుల వద్ద నుంచి.. 33 వేల ఎకరాల భూమి సేకరించారన్నారు. ప్రభుత్వ భూములు కలిపి మొత్తం 50 వేల ఎకరాల్లో రాజధాని కడతామని, ఇస్తాబుల్, సింగపూర్ తలపించేలా రాజధాని కడతామని చంద్రబాబు గొప్పలు చెప్పారని విమర్శించారు. ఇక్కడ చూస్తే.. పిచ్చి మొక్కలు తప్ప ఏమి లేవని, భూములు ఇచ్చిన రైతులు రోడ్డున పడ్డారని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh news
Amaravati capital
Ys sharmila
chandra babu
pm modi
farmers
Amaravati lands
33 వేల ఎకరాల భూమి సేకరించారన్నారు
Scroll for the next article