Politics26th Nov 05:49 PMSunil Byrisetty1 min read

పంచ సూత్రాలు కాదు.. పంచ మోసాలు

కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధినేత వైయస్ షర్మిల విమర్శలు చేశారు. రైతుల కోసం ప్రకటించిన ‘పంచ సూత్రాలు’ నిజానికి ‘పంచ మోసాలు’ అని మండిపడ్డారు. రైతు సంక్షేమం పేరుతో ప్రభుత్వం పచ్చ

పంచ సూత్రాలు కాదు.. పంచ మోసాలు
కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధినేత వైయస్ షర్మిల విమర్శలు చేశారు. రైతుల కోసం ప్రకటించిన ‘పంచ సూత్రాలు’ నిజానికి ‘పంచ మోసాలు’ అని మండిపడ్డారు. రైతు సంక్షేమం పేరుతో ప్రభుత్వం పచ్చి బూటకాలు ఆడుతోందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. గడిచిన 17 నెలలుగా రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని షర్మిల మండిపడ్డారు. "సాగుకు సమాధి కట్టి, ఇప్పుడు అన్నదాతల మేలు కోసం పంచసూత్ర ప్రణాళిక అనడానికి, ప్రచారం చేసుకోవడానికి కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలి" అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించకుండా ఎగ్గొట్టారని, పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద సగం మంది రైతులకు మొండిచెయ్యి చూపారని విమర్శించారు.
Andhra Pradesh
AP Congress
YS Sharmila
Opposition Criticism
Farmers
Panchasutras
Government Policies
Farmer Welfare
Crop Compensation
రైతు సంక్షేమం
పంట నష్ట పరిహారం
కనీస మద్దతు ధర
Scroll for the next article