Politics19th Jun 05:08 PMSunil Byrisetty1 min read
ఫోన్ ట్యాపింగా.. నాకేం సంబంధం?
తెలంగాణను కుదిపేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలను ప్రెస్ మ
తెలంగాణను కుదిపేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలను ప్రెస్ మీట్‌లో జగన్‌ను ప్రశ్నించారు. జగన్ స్పందిస్తూ.. షర్మిల ఫోన్‌ను ట్యాపింగ్ చేశారో లేదో తనకు తెలియదని అన్నారు. గతంలో షర్మిల తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారని చెప్పారు. తనకు తెలంగాణ వ్యవహారాలతో సంబంధం లేదని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌తో తనకు సంబంధం లేదని జగన్ తేల్చి చెప్పారు.