Politics11th Jul 05:55 PMSunil Byrisetty1 min read
రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం
మలి విడత భూముల సేకరణ పేరుతో చంద్రబాబు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారమని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు. ముందు 33 వేల ఎకరాల్లో రాజధాని ఎక్కడని ప్రశ్నించారు. ఆలు లేదు..చూలు
మలి విడత భూముల సేకరణ పేరుతో చంద్రబాబు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారమని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు. ముందు 33 వేల ఎకరాల్లో రాజధాని ఎక్కడని ప్రశ్నించారు. ఆలు లేదు..చూలు లేదు..కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉంది బాబు తీరు అని మండిపడ్డారు. చంద్రబాబు గాల్లో కాదు.. మీరు నేలమీద నడవండని సూచించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండగా 5 వేల ఎకరాల్లో ఇప్పుడే మరో ఎయిర్పోర్ట్ ఎందుకని నిలదీశారు. అమరావతికి అంత బిజినెస్ ఉందా.. అంత బిజి...నెస్ ఉందా అనడిగారు. రాజధాని పేరుతో అప్పులు చేసి మా నెత్తిన భారం మోపకండని వ్యాఖ్యానించారు. మలి దశ 40 వేల ఎకరాల భూ సేకరణను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని షర్మిల స్పష్టం చేశారు.