Politics24th Jul 03:32 PMSunil Byrisetty1 min read
లిక్కర్ స్కామ్ చాలా పెద్దది!
ఏపీలో లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిల అన్నారు. ఈ కుంభకోణం కేవలం రూ.3,500 కోట్లు మాత్రమే కాదన్నారు. బ్లాక్ మనీ కోసమే డిజిటల్ పేమెంట్ నిలిపేశారన్నారు. డి
ఏపీలో లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిల అన్నారు. ఈ కుంభకోణం కేవలం రూ.3,500 కోట్లు మాత్రమే కాదన్నారు. బ్లాక్ మనీ కోసమే డిజిటల్ పేమెంట్ నిలిపేశారన్నారు. డిజిటల్ పేమెంట్ ఆపడం వెనుకే అవినీతి దాగి ఉంది.. జగన్ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఎక్కడా లేని విధంగా నాటి ప్రభుత్వం చేసిన ఆర్థిక నేరం.. పన్నులు ఎగ్గొట్టాలనే నగదుతో లిక్కర్ అమ్మకాలకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్‌పై సమగ్ర విచారణ జరగాలన్నారు.. వివేకా హత్య కేసులో జగన్ అసలు అంశాలను దాచిపెట్టి మాట్లాడటంలో దిట్ట అని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ వెనుక కుట్రలు పూర్తిగా వెలికితీయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.