News19th May 04:09 PMSunil Byrisetty1 min read

విశాఖ ఉక్కు. కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్న షర్మిల

విశాఖ ఉక్కు యాజమాన్యానిది నిరంకుశ ధోరణి అని, డిమాండ్ల సాధనపై రేపటి నుంచి కార్మికులు సమ్మె బాట పడుతుంటే కనీసం దిద్దుబాటు చర్యలకు దిక్కులేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నార

విశాఖ ఉక్కు. కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్న షర్మిల
విశాఖ ఉక్కు యాజమాన్యానిది నిరంకుశ ధోరణి అని, డిమాండ్ల సాధనపై రేపటి నుంచి కార్మికులు సమ్మె బాట పడుతుంటే కనీసం దిద్దుబాటు చర్యలకు దిక్కులేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్న కనికరం లేదని, దిక్కున్న చోట చెప్పుకోండనే తీరున యాజమాన్యం వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల పొట్ట గొట్టిన యాజమాన్యం.. మరో 3 వేల మందిని రోడ్డున పడేసేందుకు కుట్రలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి అల్టిమేటం ఇస్తున్నామని, రేపటిలోగా తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ ఉద్యోగులకు 8 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణం చెల్లించాలన్నారు. లేకుంటే కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా ..21 నుంచి స్టీల్ ప్లాంట్ బయటే "ఆమరణ దీక్ష" కు దిగుతామని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని షర్మిల అన్నారు
Visakhapatnam
Vizag steel plant
YS Sharmila
steel workers
"ఆమరణ దీక్ష
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని షర్మిల
Scroll for the next article