News4th Apr 05:01 PMSunil Byrisetty1 min read
తల్లిపై కేసు వేసిన కుమారుడు జగన్.. షర్మిల ఫైర్
వైయస్ కుటుంబంలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మాజీ సీఎం, వైసీపీ అధినేత, తన అన్న జగన్ మోహన్ రెడ్డిపై షర్మిల మరోసారి ఫైరయ్యారు. ఎన్సీఎల్టీలో జగన్ తరఫున వినిపించిన వాదనలపై తీవ్ర స్థా
వైయస్ కుటుంబంలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మాజీ సీఎం, వైసీపీ అధినేత, తన అన్న జగన్ మోహన్ రెడ్డిపై షర్మిల మరోసారి ఫైరయ్యారు.
ఎన్సీఎల్టీలో జగన్ తరఫున వినిపించిన వాదనలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తన తల్లికి అన్యాయం చేసిన వ్యక్తిగా జగన్ చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు.
తల్లి తర్వాత తల్లి అంతటి వాడు మేనమామని, అటువంటి వ్యక్తే తన బిడ్డలకు అన్యాయం చేశారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
సరస్వతి పవర్ షేర్ల ఎంవోయూపై జగన్ స్వయంగా సంతకం చేశారని గుర్తు చేశారు.
కానీ ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా జగన్ తనకు ఇవ్వలేదని చెప్పారు.
'విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లను జగన్ గిఫ్ట్‌డీడ్ కింద ఇచ్చారు.
ఇచ్చిన షేర్లు మళ్లీ తనకే కావాలని ఆయన కోర్టుకు వెళ్లారు. స్వయంగా తల్లినే జగన్ మోసం చేస్తున్నారు.
తల్లిపై కేసు వేసిన కుమారుడిగా.. మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా ఆయన చరిత్రలో మిగిలిపోతారు.
జగన్‌కు విశ్వసనీయత ఉందో.. లేదో.. వైసీపీ వారే ఆలోచించాలి' అని షర్మిల వ్యాఖ్యానించారు.