News7th Oct 04:40 PMSunil Byrisetty1 min read
బిడ్డల అరోగ్య పరిస్థితి చూసి షాక్ అయ్యా: వైఎస్ షర్మిల
విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల విద్యార్థినులను APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పరామర్శించారు. బిడ్డల శరీరాలు చూస్తే ప్రభుత్వం ఏం భోజనం పెడుతుందో అర్థం అయిందని
విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల విద్యార్థినులను APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పరామర్శించారు. బిడ్డల శరీరాలు చూస్తే ప్రభుత్వం ఏం భోజనం పెడుతుందో అర్థం అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమాలియా దేశ పరిస్థితులు గుర్తుకు వచ్చాయన్నారు. ఈ మధ్య గుడితో పాటు బడి ముఖ్యం అని తాను అడిగానని, వెల్ఫేర్ హాస్టళ్లలో కనీస వసతులు లేవని ప్రశ్నించానని అన్నారు.
తన వ్యాఖ్యలకు మతం రంగు పూసి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నారు. ఇవ్వాళ కురుపాం గురుకులం ఘటన నేను చేసిన డిమాండ్ కి నిదర్శనమని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర 2047 కాదు.. స్వర్ణాంధ్ర హాస్టల్స్ విజన్ 2027 కావాలని అన్నారు. రెండేళ్లలో సంక్షేమ హాస్టళ్లు బాగుచేయాలని డిమాండ్ చేశారు.