Politics10th Oct 11:36 AMSunil Byrisetty1 min read
చంద్రబాబు రాక్షసుడంటూ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి పేదలకు YSR దేవుడైతే.. పథకాన్ని నిర్వీర్యం చేస్తూ సీఎం చంద్రబాబు రాక్షసుడు అవుతున్నారంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యశ
ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి పేదలకు YSR దేవుడైతే.. పథకాన్ని నిర్వీర్యం చేస్తూ సీఎం చంద్రబాబు రాక్షసుడు అవుతున్నారంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యశ్రీ పై కూటమి ప్రభుత్వం చేస్తున్నది మహా కుట్రలు అంటూ ఆరోపించారు. పథకం నిర్వీర్యమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రైవేటు ఆరోగ్య బీమా ముసుగులో.. సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా చంపేస్తున్నారని వ్యాఖ్యానించారు. రూ.2700 కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టడం ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తివేసే కుట్రలో భాగమన్నారు. ఏడాదిలో నెట్వర్క్ ఆసుపత్రులు రెండు సార్లు సమ్మెకు దిగినా.. బిల్లులు చెల్లింపుపై పట్టింపు లేదంటే ప్రజారోగ్యంపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందంటూ విమర్శించారు.