Politics11th Dec 03:57 PMSunil Byrisetty1 min read

"చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి దొంగ పనులు".. షర్మిల ఫైర్

కూటమి ప్రభుత్వ మాటలకు, చేతలకు పొంతన లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. "చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి దొంగ పనులు" అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని ఆరోపించా

"చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి దొంగ పనులు".. షర్మిల ఫైర్
కూటమి ప్రభుత్వ మాటలకు, చేతలకు పొంతన లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. "చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి దొంగ పనులు" అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కరెంట్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పుడు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే సర్దుబాటు ఛార్జీల పేరుతో రూ.15 వేల కోట్లను ప్రజల నుంచి ట్రూ-అప్ బిల్లుల రూపంలో వసూలు చేసి వారి జేబులకు చిల్లు పెట్టారని ఆరోపించారు.
Andhra Pradesh politics
YS Sharmila
AP Congress
Electricity charges
Chandrababu Naidu
Political criticism
Corruption allegations
అవినీతి ఆరోపణలు
విద్యుత్ ధరలు
ఏపీ ప్రభుత్వం
ఎన్నికల హామీలు
Scroll for the next article