Politics30th Oct 04:38 PMSunil Byrisetty1 min read
రైతన్నల కన్నీటిని పట్టించుకోరా?
అన్నదాతకు అర్నబ్ మిగిల్చింది ఆత్మఘోష. ఆరుగాలం పడ్డ కష్టానికి దక్కిన ఫలితం అపారనష్టమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండిస్తే, చేతికొచ్చే దశలో తుపా
అన్నదాతకు అర్నబ్ మిగిల్చింది ఆత్మఘోష. ఆరుగాలం పడ్డ కష్టానికి దక్కిన ఫలితం అపారనష్టమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండిస్తే, చేతికొచ్చే దశలో తుపాను పాలై,
రైతన్నలు కన్నీరు మున్నీరు అవుతుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. అర్నబ్ తుఫాను రైతన్నల ఆశలను మట్టిలో కలిపిందని పేర్కొన్నారు. తుఫాన్ ధాటికి జరిగింది కొండంత నష్టమైతే, ప్రభుత్వం చూపెడుతుంది గోరంత మాత్రమేనని, జరిగిన నష్టంపై క్షేత్రస్థాయి వాస్తవాలు ఒకటైతే.. ముఖ్యమంత్రి కాగితాల మీద చెప్తున్న లెక్కలు మరొకటి అని విమర్శించారు.
తుఫాన్ ప్రభావిత జిల్లాలో అన్ని పంటలు కలుపుకుంటే ప్రాథమికంగా జరిగిన నష్టం 15 లక్షల ఎకరాలకు పైనే ఉందని, పంటలు, రోడ్లు, ఇతర మౌలిక రంగాలు అన్ని కలుపుకొని దాదాపు అర్నబ్ మిగిల్చిన నష్టం సుమారు 15 వేల కోట్లయితే ప్రభుత్వం చెప్తున్న నష్ట అంచనా కేవలం రూ. 4600 కోట్లు అన్నారు. బాధిత రైతాంగానికి వెయ్యి, మూడు వేలు పరిహారం కాదు.. పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని షర్మిల హెచ్చరించారు.