Politics11th Apr 04:20 PMSunil Byrisetty1 min read

ఆ సైకోలను నడి రోడ్డుపై ఉరి తీయాలి.. షర్మిల సంచలనం

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రంగా స్పందించారు. వైయస్ జగన్ సతీమణి భారతి రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమంటూ పేర్కొన్న

ఆ సైకోలను నడి రోడ్డుపై ఉరి తీయాలి.. షర్మిల సంచలనం
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రంగా స్పందించారు. వైయస్ జగన్ సతీమణి భారతి రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమంటూ పేర్కొన్నారు. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమన్నారు. ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదన్నారు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నానని, సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదని పేర్కొన్నరు. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, టీడీపీలేనని, వారు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని షర్మిల పిలుపునిచ్చారు
YS Sharmila
YS bharathi
Chebrolu Kiran Social media trolling her tweet
సోషల్ మీడియా
అసభ్యకర పోస్టుల
Scroll for the next article