News30th Apr 06:16 PMSunil Byrisetty1 min read

షర్మిల అరెస్ట్.. మళ్లీ మట్టేనా?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అరెస్టయ్యారు. హౌస్ అరెస్ట్ అయ్యారు. ప్రధాని మోదీ రాజధాని పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలోని ఉద్దండరాయుని పాలెంలో షర్మిల పర్యటించాలని ని

షర్మిల అరెస్ట్.. మళ్లీ మట్టేనా?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అరెస్టయ్యారు. హౌస్ అరెస్ట్ అయ్యారు. ప్రధాని మోదీ రాజధాని పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలోని ఉద్దండరాయుని పాలెంలో షర్మిల పర్యటించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఏపీసీసీ చీఫ్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 2015లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్దండరాయుని పాలెంలో శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించారు. అయితే అందుకు పోలీసులు ఆంక్షలు విధించారు. అనుమతి లేదంటూ షర్మిల ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఆ ప్రాంతానికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. అనంతరం మోదీపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాడు మట్టి, నీరు మాత్రమే తెచ్చి అమరావతిని నాశనం చేశారని, ఈసారి కూడా మట్టే ఇస్తారా అంటూ ప్రశ్నించారు. దీనిపై బీజేవైఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి, కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు.
YS Sharmila Under House Arrest
Congrees
CM Chandra babu
AP Politics
కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అరెస్టయ్యారు
ఏపీసీసీ చీఫ్ నివాసం వద్ద భారీగా పోలీసులు
కాంగ్రెస్
బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Scroll for the next article