Politics26th Jul 02:58 PMSunil Byrisetty1 min read

షర్మిలకు సర్జరీ.. ట్వీట్లో అప్డేట్

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొన్నాళ్ల నుంచి యాక్టివ్ గా లేరు. ఎక్కడా వార్తల్లోనూ కనిపించడం లేదు. ఆమె కనిపించడం లేదంటూ కొన్ని వార్తా సంస్థలు వార్తలు కూడా రాశాయి. ఈ క్

షర్మిలకు సర్జరీ.. ట్వీట్లో అప్డేట్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొన్నాళ్ల నుంచి యాక్టివ్ గా లేరు. ఎక్కడా వార్తల్లోనూ కనిపించడం లేదు. ఆమె కనిపించడం లేదంటూ కొన్ని వార్తా సంస్థలు వార్తలు కూడా రాశాయి. ఈ క్రమంలో శస్త్ర చికిత్స అనంతరం వేగంగా కోలుకుంటున్నట్టు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ఎక్స్' వేదికగా తెలిపారు. ఇటీవల వైద్యులు ఆమెకు ఉదర శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు. చికిత్స అనంతరం వేగంగా కోలుకుంటున్నట్టు షర్మిల స్వయంగా వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ.. త్వరగా కోలుకోవాలని కాంక్షించిన శ్రేయోభిలాషులు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Andhra Pradesh
YS Sharmila
Andhra Pradesh Congress
APCC President
Congress Party
Surgery
Health Update
X Post
రాజకీయ వార్తలు
త్వరగా కోలుకుంటున్న షర్మిల
మద్దతుదారులు
తాజా వార్తలు
Scroll for the next article